ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే అత్యవసర ప్రయాణ పాస్‌లు ఇంటికే
- లాక్‌డౌన్ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పోలీసుల నిర్ణయం
- 8 నుంచి 16 గంటల్లోగా అందజేస్తామని వెల్లడి
- పోలీస్ స్టేషన్ల వద్ద రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం
పాస్ కావాల్సిన వారు కమిషనరేట్ సైట్లోకి వెళ్లి ‘రిక్వెస్ట్ ఫర్ పాస్’ ఆప్షన్‌ను క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి. సంబంధిత ధ్రువపత్రాలు, ఇతర ఆధారాలును అప్‌లోడ్ చేయాలి. సిబ్బంది పరిశీలించి అర్హులైన వారికి ఓ లింక్‌ను వారి మెయిల్‌కి పంపిస్తారు. దాన్ని ఓపెన్ చేస్తే పాస్ కనిపిస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకుని వినియోగించుకోవచ్చు.
ఈ విధానం వ్యక్తిగతంగాను, వాహనాలకు రెండు విధాలుగా అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ‘పాస్‌లు దుర్వినియోగం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో వారు మాత్రమే ఈ అవకాశం వినియోగించుకోవాలి’ అని శ్రీధర్‌రెడ్డి కోరారు.
Comments
Post a Comment