కరోనా కట్టడికి వినూత్న వ్యూహం... రోజు విడిచి రోజు సంపూర్ణ లాక్ డౌన్: గుంటూరు కలెక్టర్
- గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కేసులు
- 15 రోజులకు సరిపడా నిత్యావసరాలు కొనుగోలు చేయండి
- కూరగాయల దుకాణాలు కూడా రోజు మార్చి రోజు మాత్రమే
- ప్రజలు సహకరించాలన్న కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ కుమార్
ఆదివారం నాడు కూడా పూర్తి లాక్ డౌన్ అమలవుతుందని, మెడికల్ షాపులు, ఆసుపత్రులకు మాత్రమే మినహాయింపు ఇస్తామని వెల్లడించారు. ప్రజలు తమ అవసరాలకు తగినట్టుగా 15 రోజులకు సరిపడా, మందులు, చిన్నారులకు పాల డబ్బాలు, నిత్యవసరాలు కొనుగోలు చేయాలని సూచించిన కలెక్టర్, కూరగాయలు రోజు విడిచి రోజు ఉదయం పూట కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, వైరస్ వ్యాప్తిని అరికట్టాలన్నదే తమ ఉద్దేశమని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
Comments
Post a Comment