వలస కార్మికుల్లో ప్యానిక్ మొదలు... లాక్ డౌన్ పొడిగిస్తారన్న ఆందోళనతో పోలీసులపై రాళ్లు!
- సూరత్ లో ఘటన
- వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న వేలాది మంది
- స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించాలని నిరసన
- కేసులు పెట్టి, అరెస్ట్ చేసిన పోలీసులు
ఇదే సమయంలో లాక్ డౌన్ పొడిగిస్తారన్న వార్తలతో వారు నిరసనలకు దిగారు. తమకు వేతనాలు ఇప్పించాలని, ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ, రోడ్డెక్కారు. తమతమ ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించిన వేళ, దాదాపు 70 మంది వలస కార్మికులు వారిపైకి రాళ్లు విసిరారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నామని, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై రాళ్లేసినందుకు కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రజలు సంయమనంతో ఉండాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు కోరారు.
Comments
Post a Comment