Posts

వలస కార్మికుల్లో ప్యానిక్ మొదలు... లాక్ డౌన్ పొడిగిస్తారన్న ఆందోళనతో పోలీసులపై రాళ్లు!

Image
సూరత్ లో ఘటన వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న వేలాది మంది స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించాలని నిరసన కేసులు పెట్టి, అరెస్ట్ చేసిన పోలీసులు ఏప్రిల్ 14 తరువాత కూడా లాక్ డౌన్ కొనసాగితే, తమ పరిస్థితి ఏంటన్న తీవ్ర ఆందోళనలో ఉన్న వలస కార్మికులు, పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటన వస్త్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిన సూరత్ లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, సూరత్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది పలు వస్త్ర పరిశ్రమల్లో పని చేస్తున్నారు. గత నెలలో విధించిన లాక్ డౌన్ తో వీరంతా ఉపాధిని కోల్పోయి, రోడ్డున పడ్డారు. తమతమ స్వస్థలాలకు వెళ్లలేని వీరంతా, 15న లాక్ డౌన్ ముగియగానే వెళ్లిపోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇదే సమయంలో లాక్ డౌన్ పొడిగిస్తారన్న వార్తలతో వారు నిరసనలకు దిగారు. తమకు వేతనాలు ఇప్పించాలని, ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ, రోడ్డెక్కారు. తమతమ ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించిన వేళ, దాదాపు 70 మంది వలస కార్మికులు వారిపైకి రాళ్లు విసిరారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నామని, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై రాళ్...

జగన్ ను నీరోతో పోలుస్తూ విమర్శలు గుప్పించిన సుజనా చౌదరి

Image
జగన్ సొంత కక్షలు తీర్చుకోవడంలో బిజీగా ఉన్నారు కక్షతో రమేశ్ పదవీకాలాన్ని తగ్గించారు కరోనాపై దృష్టి సారిస్తే బాగుంటుంది రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ పై వైసీపీ ప్రభుత్వం వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధమని మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించుకున్నట్టు... ప్రపంచమంతా కరోనాపై పోరాటం చేస్తుంటే జగన్ మాత్రం సొంత కక్షలు తీర్చుకోవడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. తాము అనుకున్నట్టు స్థానిక ఎన్నికలను జరపలేదనే కక్షతో... ఎస్ఈసీ రమేశ్ పదవీకాలాన్ని తగ్గిస్తూ హడావుడిగా ఆర్డినెన్సును జారీ చేయడం దీనికి నిదర్శనమని చెప్పారు. కక్షపూరిత చర్యలు మాని కరోనాపై దృష్టిని సారిస్తే బాగుంటుందని సూచించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. Source

భారత్‌లో 24 గంటల్లో అత్యధికంగా 1,035 కరోనా కేసులు.. మరిన్ని పెరిగిపోయిన మరణాలు

Image
దేశంలో కరోనా కేసుల సంఖ్య 7,447 24 గంటల్లో దేశంలో 40 మంది మృతి ఆసుపత్రుల్లో 6,565 మంది కరోనా బాధితులు 239 మంది మృతి భారత్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య మరింత పెరిగిపోయింది. 24 గంటల్లో ఏకంగా 1,035 కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో కరోనా కేసుల సంఖ్య 7,447కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 24 గంటల్లో దేశంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 6,565 మంది కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. 643 మంది కోలుకున్నారు. 239 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 1574 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 188 మంది కోలుకోగా, 110 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత తమిళనాడులో అత్యధికంగా 911 మందికి కరోనా సోకింది. ఢిల్లీలో 903 మంది కరోనా బాధితులున్నారు. 25 మంది కోలుకోగా, 13 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లో 553 మందికి కరోనా సోకగా, తెలంగాణలో 473 మందికి సోకింది. ఉత్తరప్రదేశ్‌లో 431 మంది, హర్యానాలో 177 మందికి కరోనా సోకింది. కేరళలో 364 మంది కరోనా బాధితులున్నారు. లఢక్‌లో 15 మంది, జమ్మూకశ్మీర్‌లో 207 మందికి కరోనా సోకింది....

కరోనా కట్టడికి వినూత్న వ్యూహం... రోజు విడిచి రోజు సంపూర్ణ లాక్ డౌన్: గుంటూరు కలెక్టర్

Image
గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కేసులు 15 రోజులకు సరిపడా నిత్యావసరాలు కొనుగోలు చేయండి కూరగాయల దుకాణాలు కూడా రోజు మార్చి రోజు మాత్రమే ప్రజలు సహకరించాలన్న కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ కుమార్ గుంటూరు జిల్లాలో రోజూ కరోనా కొత్త కేసులు వస్తున్న వేళ, కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ కుమార్ మరిన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించారు. ఇకపై గుంటూరులో రోజు విడిచి రోజు సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతుందని, ఒక్క షాపు కూడా తీసేది లేదని తెలిపారు. రెడ్ జోన్ల పరిధిలో ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లేందుకు అంగీకరించబోమని, ప్రస్తుతం అనుమతిస్తున్న ఉదయం 6 నుంచి 9 వరకూ నిత్యావసరాల కొనుగోలు, ఇకపై రోజు విడిచి రోజు మాత్రమే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. ఆదివారం నాడు కూడా పూర్తి లాక్ డౌన్ అమలవుతుందని, మెడికల్ షాపులు, ఆసుపత్రులకు మాత్రమే మినహాయింపు ఇస్తామని వెల్లడించారు. ప్రజలు తమ అవసరాలకు తగినట్టుగా 15 రోజులకు సరిపడా, మందులు, చిన్నారులకు పాల డబ్బాలు, నిత్యవసరాలు కొనుగోలు చేయాలని సూచించిన కలెక్టర్, కూరగాయలు రోజు విడిచి రోజు ఉదయం పూట కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, వైరస్ ...

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే అత్యవసర ప్రయాణ పాస్‌లు ఇంటికే

Image
లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పోలీసుల నిర్ణయం 8 నుంచి 16 గంటల్లోగా అందజేస్తామని వెల్లడి పోలీస్‌ స్టేషన్ల వద్ద రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసరంగా ఊరెళ్లాల్సిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 8 నుంచి 16 గంటల్లోగా  ప్రయాణ పాస్‌లు వారింటికే జారీ చేస్తామని హైదరాబాద్‌లోని రాచకొండ కమిషరేట్‌ పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల కఠిన ఆంక్షలు కొనసాగిస్తుండడంతో అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారు పాస్‌ కోసం పోలీస్‌ స్టేషన్ల వద్ద బారులు తీరుతున్నారు. ఈ పరిస్థితిని నివారించేలా ఆన్‌లైన్‌ విధానం అమలు చేయాలన్న సీపీ మహేష్‌భగవత్‌ ఆదేశాల మేరకు రాచకొండ పోలీసులు ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రాచకొండ ఐటీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక కృషి చేశారు. పాస్‌ కావాల్సిన వారు కమిషనరేట్ సైట్లోకి వెళ్లి ‘రిక్వెస్ట్‌ ఫర్‌ పాస్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేసి వివరాలను నమోదు చేయాలి. సంబంధిత ధ్రువపత్రాలు, ఇతర ఆధారాలును అప్‌లోడ్‌ చేయాలి. సిబ్బంది పరిశీలించి అర్హులైన వారికి ఓ లింక్‌ను వారి మెయిల్‌కి పంపిస్తారు. దాన్ని ఓపెన్‌ చేస్తే పాస్‌ కనిపిస్తుంది. దాన్...

3 గంటలసేపు కూర్చోబెట్టనున్న 'ఆర్ ఆర్ ఆర్'

Image
భారీతనమే ప్రత్యేక ఆకర్షణ  ప్రధాన పాత్రల ప్రాధాన్యత  బలమైన సన్నివేశాలతో కట్టిపడేసే రాజమౌళి   రాజమౌళి దర్శకత్వంలో గతంలో వచ్చిన 'బాహుబలి' రెండున్నర గంటలకి పైనే వుంది. 'బాహుబలి 2' విషయానికొస్తే, 10 నిమిషాల తక్కువ 3 గంటల నిడివిని కలిగి వుంది. దాంతో 'రౌద్రం రణం రుధిరం' ఎంత నిడివిని కలిగి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా 3 గంటల నిడివిని కలిగి ఉండేలా చూస్తున్నారట. కథాకథనాలు .. బలమైన సన్నివేశాలు .. ప్రధాన పాత్రల ప్రాధాన్యత .. సందర్భానికి తగిన పాటల కారణంగా 3 గంటల నిడివిని కలిగి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. అందువలన ఆయా భాషల నటుల పాత్రలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఇక భారీతనం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కావడం వలన, నిడివి పెరుగుతుందని అంటున్నారు. మంత్రముగ్ధులను చేయడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. అందువలన ప్రేక్షకులు నిడివి గురించి ఆలోచించడం జరగదేమో.  Source

మీరు నిజమైన హీరోలు.. సెల్యూట్‌: విక్టరీ వెంకటేశ్‌

Image
వైద్యులు, పోలీసులపై సినీనటుడు వెంకటేశ్‌ ప్రశంసల జల్లు ఆసుపత్రుల్లో ప్రాణాలు కాపాడుతున్న సూపర్ హీరోలకు థ్యాంక్స్‌ కరోనాపై పోరాడుతున్న పోలీసులకు ధన్యవాదాలు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మా ప్రాణాలు కాపాడున్నారు కరోనా విజృంభణ నేపథ్యంలో పని చేస్తోన్న వైద్యులు, పోలీసులపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ విపత్కర సమయంలో వారు చేస్తోన్న సేవలు మరవలేనివని కొనియాడుతున్నారు. వైద్యులు, పోలీసులపై సినీనటుడు వెంకటేశ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. 'ఆసుపత్రుల్లో బాధితుల ప్రాణాలు కాపాడుతున్న సూపర్ ‌హీరోలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే, కరోనాపై పోరాడుతున్న పోలీసులకు ధన్యవాదాలు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మా ప్రాణాలు కాపాడుతున్నందుకు థ్యాంక్స్‌' అని ట్వీట్ చేశారు. 'మీరు నిజమైన హీరోలు సెల్యూట్‌' అని వెంకటేశ్‌ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీ, పోలీసులను ట్యాగ్‌ చేశారు. ప్రజలంతా సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని ఆయన కోరారు. కాగా, భారత్‌లో కరోనా విజృంభణతో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ప్రమాదకరమని తెలిసినప్పటికీ కరోనా బాధితులకు వైద...

చరణ్ కారణంగానే వాళ్లందరికీ చిరూతో ఛాన్స్

Image
సురేందర్ రెడ్డిని సిఫార్స్ చేసిన చరణ్  కొరటాలతో 'ఆచార్య' అలా సెట్ అయింది సుజీత్ కి అవకాశం అలా లభించింది   చిరంజీవితో సినిమా చేసే అవకాశం రావడం అంత తేలికైన విషయం కాదు. కథాకథనాలపై ఆయనకి గల అనుభవం వలన, అనేక సందేహాలను ఆయన వ్యక్తం చేస్తారు. ఆ విషయంలో ఆయనకి సంతృప్తిని కలిగించే విధంగా సమాధానాలిచ్చి ఒప్పించడం అంటే చాలా కష్టమైన పనే. అలాంటి చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని కొంతమంది దర్శకులు చాలా లక్కీగా సొంతం చేసుకున్నారు. సురేందర్ రెడ్డి .. చరణ్ తో ఒక సినిమా చేయాలని వస్తే, చరణ్ ఆయనకి చిరంజీవితో 'సైరా' చేసే అవకాశం ఇచ్చాడు. సురేందర్ రెడ్డి విషయంలో చిరంజీవిని చరణ్ గట్టిగానే ఒప్పించాడు. అలాగే కొరటాల కూడా చరణ్ కి ఒక కథ చెబితే, తను ఖాళీ కావడానికి సమయం పడుతుందంటూ చిరంజీవి దగ్గరికి పంపించాడట. అలా 'ఆచార్య' సెట్ అయింది. ఇక రీసెంట్ గా సుజీత్ కూడా చరణ్ కి కథ చెప్పడానికే వెళ్లాడట. అయితే త్వరలోనే తమ కాంబినేషన్లో చేద్దామని చెప్పి, ఈ లోగా 'లూసిఫర్' రీమేక్ చేయమని అన్నాడట. అలా చిరంజీవితో చేసే ఛాన్స్ ను సుజీత్ పట్టేశాడని చెప్పుకుంటున్నారు.  Source

మోదీ స్పష్టమైన ప్రకటన చేస్తారు: లాక్‌డౌన్‌ పొడిగింపుపై మాట్లాడుతూ 'హింట్‌' ఇచ్చిన కిషన్‌ రెడ్డి

Image
సీఎంలతో సమావేశం ముగిసిన వెంటనే ప్రకటన లేదంటే ఈ రోజు రాత్రి మోదీ ప్రకటన చేస్తారు ప్రజలకు నచ్చజెప్పే పని మోదీకి మాత్రమే సాధ్యం లాక్‌డౌన్‌ పొడిగించాలని మేము చెప్పాం.. అందరూ ఇదే చెబుతున్నారు  లాక్‌డౌన్‌ పొడిగించాలని అందరూ అడుగుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఈ రోజు రాత్రి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. 'దేశంలో కరోనా మూడో దశకు చేరలేదు. ఒకవేళ చేరితే ఇబ్బందులు వస్తాయి. ఇంకా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. మాస్కులు లేకుండా బయటకు రావద్దని నిబంధనలు విధిస్తున్నాయి. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల వద్దకే నిత్యావసర సరుకులు చేర్చుతున్నాయి. రోడ్డు మీదకు రావద్దని చెబుతున్నాయి' అని తెలిపారు. 'ఈ సమయంలో మనమందరం బాధ్యతతో ఇంట్లోనే ఉండాలి. అలా అయితేనే కరోనాను కట్టడి చేయగలం. లాక్‌డౌన్‌ కొనసాగించే అంశంపై మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, వివిధ పార్ట...

మరింత తగ్గిన క్రూడ్‌ ధర : పెట్రో ధరలు తగ్గించని చమురు కంపెనీలు

Image
బెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ 31.48 డాలర్లు డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 22.76 డాలర్లు అంతర్జాతీయ మార్కెట్లో గత కొంతకాలంగా తగ్గుదల ఆ స్థాయిలో తగ్గని పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో బెంట్‌ క్రూడాయిల్‌ ధర మరింత తగ్గింది. గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 4.14 శాతం తగ్గుదలతో 31.48 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 9.29 శాతం క్షీణతతో 22.76 డాలర్లకు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను  ప్రతి రోజు సవరిస్తుంటాయి. కానీ దేశీయ ఇంధన ధరలు  స్థిరంగానే కొనసాగుతూ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ రోజు కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. అమరావతిలో కూడా పెట్రోల్‌ ధర రూ.74.61 వద్ద, డీజిల్‌ ధర కూడా రూ.68.52 వద్ద నిలకడగా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర స్థిరంగా రూ.74.21, డీజిల్ ధర కూడా రూ.68.15 వద్దనే నిలకడగా ఉంది.  హైదరాబాద్‌లో శనివారం లీటరు పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో  పెట్రోల్ ధర రూ.75.30 వద్ద. డీజిల్ ధర కూడా...